తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె ప్రారంభమవుతుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఆర్టీసీ కార్మికులపై పని భారం, అలవెన్సులను పెంచడం, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లపై స్పందించకపోతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ హెచ్చరించింది.