స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:ఆశ ల సమస్యల పరిష్కారం కోసం ఎం సి హెచ్ ముందు ఆశా కార్మికుల ధర్నా ను జయప్రదం చేయాలని
ఆశా యూనియన్ జిల్లా 13వ మహాసభ తీర్మానం.
ఆశా కార్మికులకు18,000/ రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలని
ఆశా వర్కర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని స్థానిక ఆశా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను
పరిష్కరించుకునేందుకు భవిష్యత్తులో ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని ఐక్యంగా పోరాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం అన్నారు.
సోమవారం మెదక్ కేవల్ కిషన్ భవనంలో ఆశ వర్కర్స్ యూనియన్ పదమూడవ మెదక్ జిల్లా మహాసభ జరిగింది.ఈ మహా సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ మల్లేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మహాసభ లో కామ్రేడ్ సీతారామ్ ఏచూరి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏ మల్లేశం మాట్లాడుతూ ఆశా ఆశా వర్కర్స్ గత 20 సంవత్సరాలుగా గ్రామాలలో ప్రజలకు గర్భిణీ బాల్యంతో చిన్నపిల్లలకు కిశోర బాలికలకు సేవలు అందిస్తున్నారు అన్నారు 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్స్ సేవలను గుర్తించకుండా పారితోషకాల పేరుతో శ్రమ దోపిడీ చేస్తున్నారన్నారు ఆశా
వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఇప్పటికీ మాత్రం మరణాలు శిశు మరణాలుతగ్గాయన్నారు.
పల్లెలలో పిల్లలకు వేయించే ఇమ్యూన్జే షన్ పట్ల అవగాహన పరివర్తన తీసుకొచ్చేదాంట్లో కీలకపాత్ర పోషించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకమందు ఆశలకు ఫిక్స్డ్ వేతనం చేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు అన్నారు ఇప్పటికైనా ఆశాల సమస్యలు పరిష్కరించి ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు నిర్ణయించి అమలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
గత ప్రభుత్వం హయాంలో 107 రోజుల సమ్మె చేసి పారితోషకాలు పెంచుకోగలిగారని ఆశా వర్కర్స్ యొక్క శక్తిని ఐక్యతను ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు భవిష్యత్తులో ఆశా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మరోసారి దీర్ఘకాలిక ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహాసభలో పాల్గొన్న సీఐటీయూ జిల్లా కోశాధికారి కే.నర్సమ్మ మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఆశా వర్కర్లు సమాజంలో కీలక పాత్ర పోషించినప్పటికీ తల్లులు పిల్లలు గర్భిణీల కోసం నిరంతరం పనిచేసినప్పటికీ ప్రభుత్వం కష్టాన్ని గుర్తించకపోవడం దుర్మార్గమన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారన్నారు గ్రామస్థాయి చిన్న డాక్టరే ఎవరంటే ఆశ వర్కర్లే అని ఆమె కొనియాడారు ఒక గర్భిణీకి హాస్పిటల్ కి ఏ సమయంలో డెలివరీ టైం అయిన అర్ధరాత్రి పండగ అనే తేడా లేకుండా ఇంట్లో చిన్నపిల్లలను సంసారాన్ని వదిలి రెండు మూడు రోజులపాటు డెలివరీ అయ్యేంతవరకు హాస్పిటల్లో ఆశా వర్కర్లు తమ సేవలను అందిస్తున్నారు అన్నారు అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆశా వర్కర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి మనసు రాకపోవడం అత్యంత అన్యాయం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.స్థానిక
జిల్లా ఆశల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10వ తేదీన జిల్లా కేంద్రంలోని ఎం సి హెచ్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించాలని మహాసభ తీర్మానించిందన్నారు పదవ తేదీన జిల్లాలోని 20 ఒక్క పీహెచ్సీల ఆశా వర్కర్లు అందరూ తప్పకుండా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఆశా కార్మికులకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి అమలు చేయాలి… ఆశా యూనియన్ జిల్లా 13వ మహాసభ తీర్మానం.
