ధనవంతులు తినే బియ్యమే పేదవాళ్ళు తినాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డు దారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:బుధవారం టేక్మాల్ మండల్ చంద్రు తండా లో లంబాడా సామాజిక వర్గానికి చెందిన రమావత్ పీరియ ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనాన్ని వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉగాదిన ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో ఇలాంటి పేదవారికి ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు.సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహారభద్రత కల్పించడమే ద్యేయంగా ప్రజా ప్రభుత్వం ఆహార భద్రతా కార్డుదారులకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళలో ఆనందాన్ని స్వయంగా చూశానని కలెక్టర్ అన్నారు.సన్నబియ్యం లబ్దిదారుని కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని సంతృప్తి ఇచ్చిందని అన్నారు.భోజన అనంతరం కలెక్టర్ రమావత్ పీరియ కుటుంబ సభ్యులకు శాలువా బహుకరించి స్వీట్స్ అందజేశారు.కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వ హిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరినట్లు తెలిపారు. ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య,తాసిల్దార్ తులసిరాం ఎంపీడీవో విటల్ తదితరులు పాల్గొన్నారు.