ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
ప్రజావాణిలో 95 దరఖాస్తుల స్వీకరణ
ప్రజావాణి కార్యక్రమంలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా;సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద పలు సమస్యలపై అందించిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అనే దృష్టితో ప్రతీ దరఖాస్తుదారులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో అధికారులు విధులు నిర్వహించాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు.ప్రజావాణి లో వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు నిర్దిష్ట సమయంలో స్పందించాలని సూచించారు. ప్రజలు అధికారులను నేరుగా కలిసే వేదిక ప్రజావాణి అని పేర్కొంటూ ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరింఛి ప్రజల మన్ననలు పొందాలని అదే ప్రతి ఉద్యోగ జీవితానికి ఆశీర్వాదం అని కలెక్టర్ స్పష్టం చేశారు.ధరణి సమస్యలు – 09 భూ సమస్యలు-38 పింఛన్ కొరకు-05 ఇతర సమస్యలు-43 మొత్తం-95 దరఖాస్తు స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జడ్పీ సీఈఓ ఎల్లయ్య డిఆర్ఓ భుజంగరావు ఏవో యూనస్ వివిధశాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.