స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో బాలుర జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షించారు. వాల్యూషన్ సెంటర్లో మౌలిక వసతులు గురించి సెంటర్ ఇంచార్జ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రాల్లో బాలుర జూనియర్ కాలేజ్ నందు మార్చి-06 నుండి ప్రారంభమై 07 ఏప్రిల్ 2025ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముగిసింది అన్నారు. ఈ సెంటర్లో రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ప్రక్రియ నడుస్తుందని తెలిపారు. సుమారు 690 మంది అధ్యాపకులు మూల్యాంకన ప్రక్రియలో పాల్గొని దాదాపు 01 లక్ష 87 వేల జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారని ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారని వివరించారు.ఈరోజు ఆర్థిక శాస్త్రం సంబంధించిన సబ్జెక్టుతో వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసిందని రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ ప్రక్రియ నడుస్తుందన్నారు. త్వరలో ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. అని వివరించారు.
మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ సెంటర్ తీసుకురావడానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేసిన కృషి మరువలేనిది.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి కోడింగ్ ఆఫీసర్ శేషాచారి అసిస్టెంట్ కోడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
