స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: మెదక్ మండలం బాలనగర్ బొల్లారం మత్తడిలో ఈత కోసం వెళ్లి తుడుం నవీన్ తుడుం అనిల్ అనే వ్యక్తులు ప్రమాదవశత్తు మరణించడం జరిగింది.నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో ఈత కోసం అని బొల్లారం మత్తడికి ఇద్దరు వ్యక్తులు కలిసి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇంట్లో తల్లిదండ్రులు రాత్రి 8 గంటల సమయంలో బొల్లారం మత్తడి వద్దకు వెళ్లి చూడగా వారి యొక్క బట్టలు చెప్పులు అక్కడే ఉన్నవి దీని గమనించిన తల్లిదండ్రులకు గ్రామస్తులకు మరియు పోలీసులకు సమాచారం అందించగా ఈరోజు ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది ప్రస్తుతం ఒక శవం దొరకడం జరిగింది. ఇంకొక శవం కోసం గాలిస్తున్నారు.తుడుం నవీన్ వయస్సు 26 సంవత్సరాలు తుడుం అనిల్ వయస్సు 17 సంవత్సరాలు గ్రామస్థులు తెలిపారు.