స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
- ఘనంగా కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం
- పట్టువస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ దంపతులు
– నియోజక వర్గ ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీరాముని ఆశీస్సులతో మెదక్ నియోజక వర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకోని మెదక్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ సతీమణి శివాణి లు హాజరై పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూల మాల వేసి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధర్మానికి, నీతికి, విలువలకు, సుపరిపాలనకు నిలువుటద్దం శ్రీరాముడని ఆయన కొనియాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ రాముడి లాగా సుపరిపాలన అందిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కొనియాడారు.ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం దేశం అబ్బురపడేలా పాలన కొనసాగిస్తూ దశాబ్దాల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఇందుకు బీసీ కులగణన చేపట్టడంతో పాటు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడమే నిదర్శనమన్నారు. ఆ జగదాబి రాముడి అనుగ్రహంతో ప్రజలంతా కష్టాలు తొలిగి ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జ పవన్ తాజా మాజీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.