అంగరంగ వైభవంగా మెదక్ కోదండ రామాలయం సీతారాముల కళ్యాణ మహోత్సవం చూసి తరించిన భక్తజనం.
శ్రీరామనవమి సందర్భంగా మెదక్ కోదండ రామాలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు
స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
నియోజక వర్గ ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగదానంద కారకుడు జగదభిరాముడు భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే కోదండ రామాలయంలో రాములోరి కల్యాణ వేడుక ఆదివారం మెదక్లో లో కనుల పండువగా సాగింది.అభిజిత్ లగ్నంలో రాముడు జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్యధారణ చేశారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారని చెప్పారు. కోదండ రాముని ఆశీస్సులతో జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కోదండ రాముని కోరుకున్నట్లు కలెక్టర్ వివరించారు.