స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్:
శ్రీ కోదండ రామాలయం ఆలయ పూజారి భాష్యం మధుసూదనాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు అభిజిత్ లగ్నంలో పేళ్లి తంతును సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.శ్రీరామనవమిని పురస్కరించుకొనీ మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ యం.ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీతా,రాములను పల్లకీలో తీసుకువచ్చి మండపంలో ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో కళ్యాణం జరిపించారు.. సుమారు రెండు కుటల పాటు కల్యాణతంతు కొనసాగింది కళ్యాణాన్ని తిలకించి భక్తులు పులకించారు. శ్రీ కోదండ రామాలయంలో జరిగిన రాములోరి కల్యాణానికి భక్తులు పోటెత్తారు. పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలోని కల్యాణ మండపం భక్తులతో నిండిపోగా ఆవరణలో చలువ పందిళ్లు వేయ డంతో భక్తులు అక్కడే కూర్చుని కళ్యాణాన్ని తిలకించారు..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీరాముని యొక్క ఆశీస్సులు తెలంగాణ రాష్ట్రం పైన ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కళ్యాణంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. శ్రీరాముని యొక్క గుణగణాలు అందరూ అలవర్చుకోవాలని కోరారు. విశ్వవసునామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీరాముని మొక్కుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని పగబట్టే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.. ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్, సభ్యులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఏం లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.