స్టూడియో10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా:
ప్రభుత్వ సంక్షేమ పాఠశాలల్లో నాణ్యమైన మెనూ ఉత్తమ విద్యాబోధన
జిల్లాలో 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం
టేక్మాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
ఆసుపత్రి, కేజీబీవీ, సబ్ స్టేషన్ పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేసిన కలెక్టర్
ప్రజారోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటూ సంక్షేమ పాఠశాలల్లో నాణ్యమైన మెనూ జిల్లాలో నిరంతర విద్యుత్ అందించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.సిబ్బంది హాజరు పట్టిక ఓపి రిజిస్టర్ మందులు నిల్వ చేయి స్టోర్ రూమ్ సంబంధిత వాటిని పరిశీలించి ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోగులకు మెరుగైన వైద్య అందించాలని వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టుకోవాలని సమయపాలనతో విధులు సక్రమంగా నిర్వహించి ప్రభుత్వ ఆదేశించిన లక్ష్యాలను చేరుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న మెనూ పరిశీలిస్తూ విద్యార్థులను ప్రశ్నలతో జవాబులతో సామర్థ్యాలను పరీక్షించారు. సానుకూల సమాధానం విద్యార్థుల నుండి రాబట్టి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన మెనూ అందించి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అందిస్తున్నట్లు చెప్పారు. స్టోర్ రూమ్ను పరిశీలిస్తూ కూరగాయలు పప్పు దినుసులు నాణ్యతతో కూడినవి ఉండాలని భోజనం తయారు చేసిన వెంటనే రుచి సూచి ప్రాధాన్యతనిస్తూ తయారు చేసిన మెనూ తప్పనిసరిగా టేస్ట్ చూడాలని తదుపరి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించాలని చెప్పారు.జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉంటున్నాయని కలెక్టర్ వివరించారు. తదుపరి మండల కేంద్రంలో 33/11 KV విద్యుత్ సబ్స్టేషన్ పరిశీలించి సబ్ స్టేషన్ ద్వారా మండల కేంద్రంలో ఎన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది 24 గంటలు విద్యుత్ అందించడానికి మీ శాఖ ద్వారా తీసుకున్న చర్యలు ఓవర్ లోడింగ్ సంబంధించిన విషయాలను విద్యుత్ శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కోతలు లేని విద్యుత్ అందించడం లక్ష్యంగా అధికారులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

