స్టూడియో 10టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా : స్వాతంత్ర్య సమరయోధులు సంఘ సంస్కర్త మరియు సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిన గొప్ప నాయకుడు భారత మాజీ ఉపప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ.డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపియస్ జగ్జీవన్‌రామ్ ఫోటోకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు ఎదురు చెప్పుతూ అణగారిన వర్గాల అభ్యుదయానికి పాటుపడిన సంఘసంస్కర్త అని అన్నారు మరియు 40 సంవత్సరాలపాటు వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. విద్య వ్యవసాయం రక్షణ కార్మిక రంగాల్లో కీలకంగా సేవలందించిన జగ్జీవన్‌రామ్ భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు అన్నారు.మనం కూడా ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం సోదరత్వం కలిగిన సమాజ నిర్మాణం కోసం ప్రయత్నించాలిని ఎస్పీ అన్నారు. ఆ మహానీయులను స్మరింస్తూ వారి అడుగు జడలో నడుస్తూ మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సాయుద దళ డిఎస్పి రంగా నాయక్ మరియు SB ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి మరియు RI శైలందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.