స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు ఆవరణలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబూ జగ్జీవన్ రాం 118 జయంతి వేడుకలు వివిధ దళిత సంఘం నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పూలమాలలతో నివాళులర్పించారు.
జిల్లా ప్రజలకు బాబూ జగ్జీవన్ రాం 118 జయంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో వెల్కమ్ బోర్డు దగ్గర బాబూ జగ్జీవన్ రాం 118 జయంతి కార్యక్రమంలో వివిధ దళిత సంఘ నాయకులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొని బాబూ జగ్జీవన్ రాం చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రలో చిరకాలం నిలిచే మహనీయుల జయంతులు వర్ధంతిలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు బాబూ జగ్జీవన్ రాం నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని
అట్టడుగు వర్గాల నుంచి ప్రధానమంత్రి ఉన్నత స్థానంలో దేశానికి సేవ చేసిన మహనీయుడని అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి దేశానికి సేవ చేస్తూనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి ఎలకట్ట లేనిదని కొనియాడారు.గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు నిరంతనం కృషి చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రాం అని వారి జీవిత చరిత్ర అవగతం చేసుకోవాలని అతి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకుని తల్లి పాలనలో సేవా భావంతో దళితులపై వివక్ష సమాజంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడిన వ్యక్తిగా చిరస్థాయిగా నిలుస్తారన్నారు వివిధ హోదాలలో సేవలందించి దళిత ప్రజా శ్రేయస్సు కోసం పోరాటం చేసిన మహానీయుడు జగ్జీవన్ రాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి శశికళ వివిధ దళిత సంఘం కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.