స్టడియో10టీవీ ప్రతినిధి సురేందర్ రిపోర్టార్ నవీపేట్
తేదీ :-7-1-2025
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిజామాబాద్ అధ్యక్షులు ఆర్.జగదీశ్వర్ రావు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గారిని కలిసి జిల్లాలోని పరిశ్రమలకు మరియు వ్యాపారస్తులకు సంబంధించి సమస్యల పై మెమొరాండం సమర్పించారు. నిజామాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్,ఇండస్ట్రియల్ ఎస్టేట్ పట్టణ చుట్టూ పక్కల 15 కిలోమీటర్ల లోపు వరకు స్థాపించాలని దాని వల్ల అనేక పరిశ్రమలు మరియు వ్యాపారాలు,ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు అదే విధంగా సికింద్రాబాద్,నిజామాబాద్ మరియు పెద్దపల్లి రైల్వే లైన్ డబ్బ్లింగ్ చేస్తూ గుడ్స్ షెడ్ కారిడార్ నిర్మించాలని దానివల్ల నిజామాబాద్లో వ్యాపారం అభివృద్ధి చెందుతుందని విన్నవించారు.నిజామాబాద్ లో కంటైనర్ డిపో నిర్మిస్తే ఇక్కడ తయారైన సరుకులు వేరే దేశాలకు సులభంగా ఎగుమతి అవుతాయని దానివల్ల ఇక్కడ వ్యాపారాలు,కొత్త పరిశ్రమలు అభివృద్ధిచెందే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా స్పైస్ బోర్డు ఏర్పాటు అనంతరం పసుపు రైతులకు మరియు వరి రైతులకు తృణ ధాన్యాలు పండించే రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మెలుకువలు నేర్పి వారి ఉత్తపతులకు మంచి ధర వొచ్చెలగా ప్రయత్నం చెయ్యాలని కోరారు, మరియు మన నిజామాబాద్ లో NABL లాబొరేటరీ స్థాపిస్తే ఇక్కడి రైతుల సరుకులు ఉన్నత ప్రమాణాలతో ఎగుమతి చెయ్యావొచ్చని మరియు ఈశాన్య రాష్ట్రాలకు,గుజరాత్ రాష్ట్రానికి ఇస్తున్న సబ్సిడీలు నిజామాబాద్ కి కూడా ఇస్తే ఇక్కడ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని తెలిపారు.యువత పరిశ్రమలు స్థాపించి వ్యాపారం చేయడాన్ని ప్రోత్సహించాలని వారికి పరిశ్రమల శాఖ,బ్యాంకులు సహకరిస్తూ సదస్సులు ఏర్పాటు చేసి యువతని ఆహ్వానిస్తే కొత్త పరిశ్రమలు ఇక్కడ వెళ్లివిరుస్తాయని కావున తగు చర్యలు తీసుకోస్కొనగలరని జిల్లా పాలనాధికారి గారికి విజ్ఞప్తి చేయగా విజ్ఞప్తినీ సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు మరియు ప్రతి సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీని అహ్వానించి తగు సలహాలు,సూచనలు తీసుకుంటాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు V. శ్రీనివాసరావు, సభ్యులు గంగాధర్ రావు, అంబోజీ హరిప్రసాద్, జామిల్ సైబర్ న్యాయవాది,పూర్వ అధ్యక్షుడు వెంకట నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.