క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ పోస్టర్లను ప్రారంభించిన జిల్లా ఎస్పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి.
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: పోలీసుల పనితీరు పోలీసుల పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ రూపొందించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ పోస్టర్లను జిల్లా ఎస్పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.డీజీపీ కార్యాలయం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లు జిల్లాల ఎస్పీలతో గురువారం జరిగిన సమావేశం డీజీపీ డాక్టర్ జితేందర్ క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ పోస్టర్లను లాంఛనంగా ప్రారంభించారు. బాధితులు సమస్యలు విన్నవించేందుకు పోలీస్‌స్టేషన్లకు వెళ్లిన అనంతరం పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరు ఫిర్యాదులు మొదలు పాస్‌పోర్ట్ వేరిఫికేషన్,ఈ చలాన్ ఎఫ్.ఐ.ఆర్ ఇతర సేవల గురించి పోలీస్ సిబ్బందిపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్‌కోడ్ అందుబాటులో తీసుకొని రావడం జరిగిందని ఈ పోస్టర్లు పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లు సర్కిల్ ఇన్స్‌పెక్టర్,డిఎస్పి కార్యాలయల్లో స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లాఎస్పి తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో వుండే క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్ ప్రజలు సద్వినియోగం చేసుకొని అబిప్రాయాలు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధానపు ఎస్పి.ఎస్.మహేందర్ మరియు మెదక్ టౌన్ డిఎస్పి.ప్రసన్న కుమార్ మరియు తూప్రాన్ డిఎస్పి.వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.