శ్రీశైలం :
ఏపీలోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో ఈ నెల11 నుంచి 17 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.తొలి రోజు ఉదయం స్వామివారి యాగశాల ప్రవేశ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.12న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి వాహన సేవలు,14న కల్యాణం,16న యాగ పూర్ణాహుతి, త్రిశూలస్నానం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు ఉంటాయి.చివరి రోజైన 17న పుష్పోత్సవం నిర్వహిస్తారు.