స్టూడియో10టివి , ప్రతినిధి సిల్వర్ రాజేష్ , మెదక్ జిల్లా: మెదక్ జిల్లా పోలీస్ గ్రౌండ్ నందు ఘనంగా ప్రారంభమైన డిస్ట్రిక్ట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్.జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్. బుధవారం నూతన పోలీస్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైన డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ పాల్గొన్నారు. అనతరం గౌరవ వందనం స్వీకరించారు. ఈసందర్భంగా గౌరవ అతిథి జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్ మాట్లాడుతూ.. ఖాకీ బట్టలతో నిత్యం పని ఒత్తిడిలో పరుగులు తీసే పోలీసులు ఆ పనులు పక్కన పెట్టి ఆటలు ఆడేందుకు మైదానంలో దిగారని డీఎస్పీ సీఐ ఎస్‌ఐ ఏఎస్‌ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డు ఇలా హోదాలను పక్కన పెట్టితమ జట్టును గెలిపించు కునేందుకు కలిసికట్టుగా పోరాడాలని పోలీసు సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణతో పాటు క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పోలీసు అధికారులకు సిబ్బందికి సూచించారు. నిత్యం పనిఒత్తిడితో విధులకు హాజరయ్యే పోలీసులకు మానసిక ప్రశాంతత కోసం స్పొర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పరితపిస్తున్న పోలీసులకు ఆటల పోటీలు నూతన ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు. క్రీడలు పోలీసులకు ఉపశమనాన్ని కలిగిస్తాయన్నారు.గెలుపు ఓటములు సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గెలుపోటములు ముఖ్యంకాదని క్రీడా స్ఫూర్తితో ఆడాలని సహృద్భావ వాతావరణంలో ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఆరోగ్యం ఉల్లాసం ఉత్సాహానికి క్రీడలు దోహదపడతాయన్నారు. సమాజంలో పోలీసు పాత్ర అనేది అత్యంత కీలకమని పోలీసు ఉద్యోగం అనేది వత్తిడి శ్రమతో కూడినదని వత్తిడిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఇలాంటి క్రీడా కార్యక్రమాలు బాగా దోహదం చేస్తాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ బాగా ఆడాలని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని గెలుపు ఓటములు సహజమని ప్రతి ఒక్కరూ గెలుపుకోసం ఆడాలని క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని జిల్లా పేరును నిలపడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలంటూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం మనిషి జీవితంలో క్రీడలు ఒక భాగంగా ఉండాలని అన్నారు.క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్రీడలో నిత్యం సాధన చేస్తూ ఉండడం వలన దైనందిన కార్యక్రమాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొనవచ్చని అన్నారు. జిల్లాలో మూడవ సారి ఈ స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఘనంగా ఈ ఏర్పాట్లను చేసిన ఆర్మడ్ రిజర్వు అధికారులను అభినందించారు.అనంతరం స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా పావురాన్ని గాలిలోకి వదిలారు.పోలీసు అధికారులు సిబ్బందికి మూడు రోజులపాటు జరగనున్న ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ వాలీబాల్ 100 మీటర్ల పరుగు పందెం 200 మీటర్ల పరుగు పందెం 4×100 రిలే టగ్ఆఫ్ వార్ డిస్కస్ త్రోషాట్ ఫుట్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని రెండు పోలీస్ సబ్ డివిజన్ల నుండి ఏ.ఆర్.హెడ్ క్వాటర్ పోలీస్ అధికారులు సిబ్బంది ఈ స్పోర్ట్స్ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనభరిచిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలకు జిల్లా తరపున పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డి.ఎస్.పి ప్రసన్న కుమార్ ఏ.ఆర్ డి.ఎస్.పి.రంగ నాయక్ జిల్లా సి.ఐ.లు ఆర్.ఐ. ఎస్.ఐ ఆర్ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.