ఒడిశా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారత హాకీ జట్లకు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఒడిశా రాష్ట్ర సర్కారు ఇప్పుడు మరో దేశీయ క్రీడను కూడా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చింది. వచ్చే మూడేళ్ల పాటు భారత జాతీయ ఖోఖో జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించ నున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. 2025 నుంచి 2027 మధ్య ఏడాదికి రూ. 5 కోట్ల చొప్పున కేటాయించ నున్నట్లు వెల్లడించింది.