సంక్రాంతి నేపథ్యంలో శ్రీకాకుళం రోడ్డు (ఆముదాలవలసకు) రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 7,8,9,10,12,13, 14,15 తేదీల్లో చర్లపల్లి, కాచిగూడ నుంచి శ్రీకాకుళం కు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేఅధికారులు సోమవారం తెలిపారు. ఈమేరకు సంక్రాంతి పండుగకు జిల్లాకు రానున్న ప్రయాణీకులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులు టిక్కెట్లు బుక్కింగ్ కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.