చైనాలో ప్రారంభమైన ‘హ్యూమన్ మెటాన్యూమో వైరస్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అంటూ ట్రెండ్ అవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది. అలాంటి వదంతులు నమ్మొద్దని కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలు పుట్టించొద్దని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ వైరస్ కొత్తదేమీ కాదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు.