స్టూడియో 10 టివి,ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజావాణికి వచ్చే దరఖాస్తులపై అలసత్వం తగదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగరావు జడ్పీసీఈఓ ఎల్లయ్య డి.ఆర్.డి.ఓ.పి.డి శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ సమస్యలతో వచ్చే ప్రజల నుంచి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.ఈ సందర్భంగా (61)ఆర్జీలను కలెక్టర్ స్వీకరించారు. పింఛన్ల కొరకు -03 భూ సమస్యల- 20 ఇందిరమ్మ ఇండ్ల కొరకు-11ఇతర సమస్యలు-27ఉన్నాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన విజ్ఞప్తుల పరిష్కారం దిశగా అత్యంత ప్రాధాన్యతతో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అదే విధంగా అర్జీలు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించి పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని అలాగే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి సోమవారం తప్పనిసరిగా నిర్వహించాలని అందుకు తగ్గట్లుగా ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో యూనస్ ఇతర శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.