స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ ఆదేశానుసారం భాదితులకు అందించిన తూప్రాస్ డిఎస్పి. ఎస్.వెంకట్ రెడ్డి.ఈ సందర్భంగా తూప్రాన్ డిఎస్పి.ఎస్.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో 16 మొబైల్స్ ను మరియు కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో 7 మొబైల్స్ అదే విధంగా చిలపిచేడ్ పరిదిలో 2 మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందచేయడం జరిగింది. ఫోన్ పోగొట్టుకొన్న వ్యక్తులు పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఫోన్ నెంబర్ ను మరియు IMEI నంబర్ ను CEIR పోర్టల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజున మొబైల్స్ దొరికిన వద్ద వారి నుండి రికవరీ చేసి సంబంధిత భాదితులకు అప్పగించడం జరిగింది.ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే లేదా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని ఓక వేల పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యుటర్ పరిజ్ఞానం లేనియెడల ప్రతి పోలీసుస్టేషన్ లోఒక పోలీసు అధికారిని ఈ CEIRportal కి భాద్యతాదికారిగా నియమించడం జరిగినది అని అతనిని పోలీసు స్టేషన్ కు వెల్లి సంప్రదించిన అతను CEIR portal లో నిక్షిప్తం చేస్తాడు అని తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు. మొబైల్స్ ను రికవరీ చేయడం లో కృషి చేసిన సిబ్బంది కి అభినందించారు.ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ జానారెడ్డి మరియు కౌడిపల్లి ఎస్ఐ రంజీత్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!