స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
ప్రజల యొక్క భద్రతే మా లక్ష్యం.రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.ఆదేశాల మేరకు 33వ రోడ్డు సేఫ్టీ కార్యక్రమం నిర్వహించిన అల్లాదుర్గ్ సిఐ రేణుక రెడ్డి.ఈ సందర్బంగా అల్లాదుర్గ్ సిఐ రేణుక రెడ్డి మాట్లాడుతూ టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు వాహనాలు నడిపే సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు చట్టం యొక్క అవగాహన కల్పించడం జరిగింది.కొద్ది పాటి నిర్లక్ష్యం ఫలితంగా కుటుంబాలు రోడ్డు పాలవుతాయనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి.మద్యం సేవించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోబడునని ప్రజలకు హెచ్చరించడం జరిగింది. హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితె కలిగే నష్టాలను కళ్లకు కటినట్టు ప్రజలకు వివరించడం జరిగింది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
ఫోర్ వీలర్ నడిపే వ్యక్తులు ఎల్లపుడూ సీటు బెల్టుని ధరించండి.వేగ పరిమితులను అనుసరించాలి.రహదారి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణీత వేగంతో వెళ్లాలి.డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లు ఆహారం మరియు ఇతర పరధ్యానాలను దూరంగా ఉంచండి.
టైర్లు బ్రేక్‌లు మరియు లైట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
ఇతర డ్రైవర్ల చర్యలను అంచనా వేయండి మరియు ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉండండి.నియమించ బడిన జీబ్రా క్రాసింగ్‌ల వద్ద మాత్రమే రోడ్డు ను దాటండం సురక్షితం.
ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎల్లపుడూ పాటించండి.