అర చేతిలో అంతర్జాలంతో జాగ్రత్త సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు… జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.
ఈ రోజు జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ మాట్లాడుతూ ఇటీవల మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన సైబర్ నేరాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి యొక్క ఫోన్ బాలానగర్ వద్ద దొంగిలించబడినది.నెల రోజుల తరవాత కొత్త సిమ్ ని తీసుకొని రిచార్జ్ చేసాడు.3 రోజుల తరవాత ATM వద్ద నగదును డ్రాచేసి బ్యాలెన్స్ చెక్ చేయగా బ్యాలెన్స్ తక్కువగా వున్నట్లు గుర్తించి వెంటనే మిని స్టేట్మెంట్ తీసుకున్నాడు.సుమారు లక్ష రూపాయలు మూడు రోజులలో ఆరు ట్రాన్సాక్షన్లు జరిగినట్టు గుర్తించాడు. వెంటనే బ్యాంక్ మేయిన్ బ్రాంచ్ కి వెళ్ళి Debit Card & Block చేయించినాడు. అప్పుడు ఫిర్యాదుదారుడు సైబర్ నేరానికి గురి ఆయనని గమనించి అతను 1930కి కాల్ చేసి ఫిర్యాదు లేవనెత్తాడు.బ్యాంక్ ఖాతాల పాస్ వడ్స్ మరియు OTP లు ఎవరికి పడేతే వారికి ఇవ్వకుండా ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి. అపరిచితుల నుండి కాల్స్ వచ్చినప్పుడు మన ఫోన్ కీబోర్డు పై వారు చెప్పిన నంబర్స్ ఎంటర్ చేయవద్దు. అపరిచిత వ్యక్తులు పంపిన లింక్స్ పై క్లిక్ చెయ్యకండి. వాళ్ళు పంపిన ఎలాంటి యాప్స్ (APK ఫైల్స్) ఇన్స్టాల్ చెయ్యకండి.