స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా.

వికారాబాద్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పోత్ ధార్ వారి ద్వారా రెవిన్యూ చట్టాలు సర్వీస్ మేటర్స్ ఆర్టిఐ యాక్ట్ బాధ్యతగా విధులు నిర్వహణ అంశాలపై వర్క్ షాప్ నిర్వహణ.నూతనంగా కొలువుల సాధించిన జూనియర్ అసిస్టెంట్లకు మండలాల్లో రెవిన్యూ కార్యాలయాలకు కేటాయింపు గ్రూప్ ఫోర్త్ ద్వారా 44 జిల్లాలో ఎంపిక.మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్.ఉద్యోగం పెద్దదా చిన్నదా అనేది కాదు బాధ్యతగా క్రమశిక్షణగా విధినిర్వహణ కర్తవ్యంగా భావించాలని అదనపు కలెక్టర్ కలెక్టర్ నగేష్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులకు సూచించారు.శనివారం సమీకృత కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ -04th ద్వారా జిల్లాలో 44 మంది యువత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులుగా ఎంపిక కావడం విధి నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది.


ఈ అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించడం చాలా గొప్ప విషయమని తొందరలో వీరందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అన్ని మండలాల రెవిన్యూ కార్యాలయాలకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులుగా కేటాయించడం జరుగుతుందని వివరించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించడం జిల్లాలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అత్యంత చేరువలో మీ పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు. రెండే రెండు శాఖల ఒకటి రెవిన్యూ రెండో వరుసలో పోలీస్ శాఖ అత్యంత కీలకంగా ఉండబోతాయని ఇందులో ప్రజలకు అవసరాల నిమిత్తం రెవెన్యూ శాఖ అత్యంత కీలకంగా ఉంటే న్యాయపరమైన సమస్యలు భద్రతా చర్యలు పోలీస్ శాఖ సమకూర్చుందని వివరించారు.


జూనియర్ అసిస్టెంట్లుగా కొలువులు సాధించి భవిష్యత్తులో మీకున్న విద్యా అర్హతలతో పదోన్నతులు సాధించి మీరు చేస్తున్న శాఖకు వృత్తికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అంతకు ముందు వికారాబాద్ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పోత్ ధార్ రేవిన్యూ చట్టాలు ఆర్టిఐ యాక్ట్ సర్వీస్ మేటర్స్ బాధ్యతగా కొలువుల నిర్వహణ సంబంధిత అంశాలపై జిల్లాలో గ్రూప్ ఫోర్త్ పరీక్షల ద్వారా ఎంపికైన 44 మంది జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి భుజంగరావు కలెక్టరేట్ ఏవో యునస్ తాసిల్దార్ శ్రీనివాస చారి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!