స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
రోడ్డు భద్రత ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలిజిల్లా హెడ్ క్వార్టర్ లో పిల్లలచే రొడ్డు భద్రతా ప్రమాణాల పై భారీ ర్యాలీగురుకులాలో పిల్లలకు అందించే ఆహార నాణ్యత పై తనిఖీలు నిర్వహించాలి*రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.శనివారం రాష్ట్ర బీసీ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేదని దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రొడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన
కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల పై వేడుకలను ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు.పిల్లల్లో రొడ్డు భద్రతా ప్రమాణాల పై అవగాహన కల్పించేందుకు ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా మండల హెడ్ క్వార్టర్ లో భారీర్యాలీ చేపట్టాలని అన్నారు.
ఆర్&బీ పంచాయతీ రాజ్ శాఖ తమ పరిధిలో రొడ్డుభద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు. రవాణా శాఖ పోలీస్ శాఖ విద్యాశాఖ రొడ్డు భవనాలు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు. భారీ తుఫాన్లు వరదలు రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని రొడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పని చేయాలని అన్నారు. రొడ్డు భద్రతా ప్రమాణాలను పిల్లల సిలబస్ లో కూడా పెట్టెలా చూస్తామని అన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించాలని అన్నారు.రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని స్థానిక మంత్రులు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ వినియోగించేలా ప్రోత్సహిస్తూ కొంతమందికి హెల్మెట్ పంపిణీ చేయాలని ఈ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాలలో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు.రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రతా కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని పాఠశాలలో రోడ్డు భద్రత ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లలకు మెస్ చార్జీలు పెంచామని వారికి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పిల్లలకు అందించే ఆహర నాణ్యతను కలెక్టర్లు ఉన్నతాధికారులు తనిఖీ చేయాలని ఆహర సరఫరాచేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరగా చెల్లిస్తున్నామని నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ ఉండవద్దని అన్నారు.
రోడ్డు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ మాట్లాడుతూ జనవరి నెల మొత్తం రోడ్డు భద్రత ప్రమాణాల కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరిగే రొడ్డు ప్రమాదాలలో 75% డ్రైవర్ తప్పుల వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలోని వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత ప్రమాణాలు పాటించాల్సిన నియమ నిబంధనల పై అవగాహన కల్పించాలని అన్నారు. రోడ్ల పై ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ ఏ ఆసుపత్రికి తీసుకుని రావాలి ఒక ప్రణాళిక ఉండాలని దిని పై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియా గుర్తించాలని అక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.
ప్రతి పాఠశాల పరిసరాలలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు.రోడ్డు భద్రత ప్రమాణాలపై లోకల్ ఎఫ్.ఎం.రేడియో కేబుల్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. రోడ్లు భవనాల శాఖ పంచాయతీ రోడ్లు జాతీయ రహదారుల్లో అవసరమైన సైన్ బోర్డులు ఉండేలా జిల్లా రవాణా శాఖ అధికారి పర్యవేక్షించాలని సూచించారు.ఈ వీడియో సమావేశం అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై జిల్లా కలెక్టర్ రాజ్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత కార్యక్రమాలు విజయవంతం చేయడానికి పటిష్ట ప్రణాళికల ద్వారా చర్య తీసుకుంటున్నామని. జిల్లాలో 33 బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగిందని ప్రమాదాల నివారణకు అధికారులు సమిష్టిగా పనిచేయాలన్నారు.కళాశాలలో యువతకు రోడ్డు ప్రమాదాలపై జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కేవలం డ్రింక్ అండ్ డ్రైవ్ అవగాహన లేమి డ్రైవింగ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడం ప్రమాదాలు జరుగుతాయని ప్రమాదాల నియంత్రణకు జిల్లా యంత్రాంగంతో అనేగా అవగాహన కార్యక్రమాల ద్వారా తోడ్పాటు అందించి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడం జరుగుతుందని 2024 సంవత్సరంలో అధిక మొత్తంలో డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని అతి వేగంతో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారినబడి ప్రాణాలు కోల్పోయి కుటుంబాల వీధిని పడే పరిస్థితి ఏర్పడుతున్నాయని రోడ్డు భద్రత మాసవత్సవం లో విస్తృతంగా పాల్గొని శాఖపరంగా చర్యలు చేపడతామన్నారు. ఈకార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ సర్దార్ సింగ్ జిల్లావిద్యాశాఖ అధికారి రాధాకృష్ణ ఆర్టీసీ డిఎం సురేఖ రెవిన్యూ పోలీస్ రవాణా అధికారులతో పాటు మెదక్ రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.