ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మక విద్య మండల విద్యాధికారి ఎల్. పురందాస్
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేవెళ్ల మండల శాఖ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్ పురందాస్ మరియు జిల్లా కార్యదర్శి మహ్మద్ అక్బర్ తో కలిసి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎల్ పురందాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి అనుభవం కలిగిన విషయ నిపుణులు ఉన్నారని, వారి ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి పేద పిల్లలకు గుణాత్మక విద్య అందించడం సాధ్యమవుతుందని అన్నారు. కాబట్టి మండలంలోని ఉపాధ్యాయులందరూ తమ పాఠశాలలోని విద్యార్థులను ఉత్తమములుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి మహమ్మద్ అక్బర్ మాట్లాడుతూ తమ సంఘం హక్కుల కోసం ఎంతగానైతే పోరాడుతుందో, అంతే బాధ్యతతో కూడా పనిచేయాలని సూచిస్తుందని తెలిపారు. తమ సంఘంలోని ఉపాధ్యాయులు అందరూ ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా పనిచేస్తూ పాఠశాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లడంలో ముందు ఉంటారని వారి కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పడాల ప్రవీణ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కిరణ్ మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, కోశాధికారి చాకలి కృష్ణ, మండల బాధ్యులు వీరయ్య, యాదగిరి, మధుకర్,పాండ్యా, అక్షయ్, పావనీలత,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.