స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
టిపిటిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే .
కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని అదిశగా రేవంత్ సర్కార్ ముందుకుసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ పట్టణంలోని టిపిటిఎఫ్ జిల్లా కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి స్థాపిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మెస్ చార్జీలు పెంచిందన్నారు.మరోవైపు హాస్టల్ విద్యార్థులకు సైతం కాస్మోటిక్ చార్జీలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. పేద విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దెందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.