మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్.

స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

  • మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడం హర్షనీయం
  • త్వరలోనే బిసి కమ్యునిటీ హాల్ భవనం కు నిధులు మంజూరు చేస్తా
  • ఏడుపాయలకు తొలిసారి ముఖ్యమంత్రి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే
  • మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
    మహిళల సమానత్వం కోసం వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు.శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని టి.ఎన్.జి.ఓ.భవనంలో బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నోముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘననంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను సులభతరం చేసేందుకు విశేషంగా కృషి చేశారని అన్నారు.విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు. ఆమె “గో గేట్ ఎడ్యుకేషన్” కవిత ద్వారా అణగారిన వర్గాలకు విద్యాభ్యాసం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రోత్సహించిందన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన ఆ మహనీయురాలు తర్వాత కాలంలో 17 పాఠశాలలను ప్రారంభించి మహిళా విద్యను ప్రోత్సహించిందని పేర్కన్నారు. ఆమె సేవలను గుర్తించిన మన రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆమె జయంతి అయిన జనవరి 3వ తేదీని ప్రతి ఏట మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షనీయం అని ఆయన అన్నారు.ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు.అనంతంర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్ బొజ్జ పవన్ న్యాయవాది జీవన్ రావ్ టిఎన్జిఓ సంఘం బాధ్యులు దొంతి నరేందర్ లతో పాటు తదితరులు పాల్గోన్నారు.బిసి కమ్యూనిటీ హాల్ భవనం కు నిధులు మంజూరు చేస్తాసావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ కు బిసి సంక్షేమ సంఘం సభ్యులు బిసి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తానని ఆయన ప్రకటించారు.బార్ అసోసియేషన్ భవనం కొరకు నిధులు మంజూరుకు విజ్ఞప్తి.మెదక్ విచ్చేసిన ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ కు మెదక్ బార్ అసోసియేషన్ సభ్యులు మెదక్ కోర్ట్ కాంప్లెక్స్ లో అసంపూర్తిగా ఉన్న బార్ అసోసియేషన్ (న్యాయవాదుల భవనం) కొరకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి పత్రాని అందజేస్తున్న మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సుభాష్ చంద్ర గౌడ్ న్యాయవాదులు జీవన్ రావ్ పిడి ఆనందం రావ్ భీమరి గణేష్ లు విజ్ఞప్తి పత్రాని అందజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నిధులను కేటాయిస్తానని హామినిచ్చారు.
    టిపిటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ. మెదక్ పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ శుక్రవారం టిపిటిఎఫ్ కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ తో పాటు డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం బాధ్యులు ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!