స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర మాజీ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని నందినగర్ వారి నివాసంలో నూతన సంవత్సరం సందర్బంగా మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ శాసనసభ్యులు పద్మ దేవేందర్ రెడ్డి తోపాటు మెదక్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి కాలిసారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా నాయకులకు వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పట్లదిశానిర్దేశం చేసి గెలుపు సత్తా చాటాలని అండగా కేసిఆర్ ఉంటారని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ పార్టీ కన్వీనర్ మరియు తదితరులు పాల్గొన్నారు.