స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.యెస్.
శంకరంపేట-అ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఒక దరఖాస్తు వివరాలను తెలియజేస్తూ కొండ సాయిలు S/o నర్సింలు వయస్సు-34 సంవత్సరాలు కులం-కుర్మా Occ: కూలి గ్రామం మూసాపేట. శంకరంపేట-అ మండలం. జంబికుంట గ్రామ శివారులో గొర్రెలు మేపడానికి అతను మరియు అతని తండ్రి తో కలసి పోయినారు . సాయంత్రం 6 గంటల సమయంలో జంబికుంట గ్రామానికి చెందిన గందరిపల్లి సంగమేశ్వర్ S/o దుర్గయ్య మరియు అతని స్నేహితులతో కలసి కర్రలు గడ్డపరాలతో కొండ సాయిలు ను మరియు అతని తండ్రిని కొట్టిన్నారు. అతని యొక్క తండ్రి నా కొడుకును కొట్టకండి అని వెడుకున్నా వినకుండా సంగమేశ్వర్ అతని స్నేహితులతో కలసి రక్తం వచ్చేటట్లు కొట్టిన్నారు.వారు పోలీస్ స్టేషన్ కు వచ్చి గందరిపల్లి సంగమేశ్వర్ పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా శంకరంపేట-అ పోలీసు వారు కేసు నమోదు చేసి సాక్షాదారాలను కోర్ట్ కి నివేదించడమైనదని అన్నారు. పూర్తి సాక్షాదారాలను పరిశీలించిన గౌరవనీయులైన జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రుబిన ఫాతిమా అట్టి నేరాన్ని విచారించి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష విదించినారని అన్నారు.
నిందితుని వివరాలు
గందరిపల్లి సంగమేశ్వర్ S/o దుర్గయ్య వయస్సు : 34 సంవత్సరాలు కులం కుర్మా Occ-కూలి R/ జంబికుంట శంకరంపేట-అ మండలం.
రాజ్ కుమార్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ASJ కోర్టు మెదక్ కేసు విచారణ అధికారులు.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్
సత్యనారయణ ఎస్.ఐ శంకరంపేట-అ
ప్రస్తుత ఆఫీసర్
శంకర్ ఎస్.ఐ.శంకరంపేట-అ
కోర్ట్ లైజనింగ్ మరియు కానిస్టేబుళ్లు.
1).బి.విట్టల్ ఎస్.ఐ కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్
2) A. కృష్ణ PC 2222
3) K.విటోబ PC 2626
కేసు యొక్క పూర్తి సాక్షాదారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఈ సంధర్భంగా అభినందించారు.