హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రజాసేవకు ఎప్పుడూ ముందు ఉంటా కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు

స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రజాసేవకు ఎప్పుడూ ముందు ఉంటానని మరోసారి నిరూపించారు కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు గారు. ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేసిన ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ముఖ్యంగా పారడైస్ బోయినపల్లి కొంపల్లి మేడ్చల్ ఆల్వాల్ హకీంపేట్ షామీర్పేట్ ప్రాంతాల ప్రజలకు మెట్రో సేవలు తీసుకురావడంలో మైనంపల్లి హనుమంతరావు ముందడుగు వేశారు.ఆయా ప్రాంతాలకు మెట్రో సేవలను తీసుకురావాలనే సంకల్పంతో మైనంపల్లి హనుమంతరావు ఎప్పటినుండో తాపత్రయపడుతున్నారు.ఏడాది క్రితం రాష్ట్రంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడంలో ఆయనే కీలకపాత్ర పోషించారు.సీఎం రేవంత్ రెడ్డి తో పాటు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో అనేకసార్లు ఈ విషయంపై సమావేశం జరిపారు.మెట్రో సేవలు అందుబాటులోకి రావడం ద్వారా బోయిన్పల్లి ఆల్వాల్ కొంపల్లి హకీంపేట్ మేడ్చల్ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు హైదరాబాద్ మహానగరం తో కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని వివరించారు.

కంటోన్మెంట్ సైనిక్పురి తదితర ప్రాంతాల ప్రజలకు మెట్రో సర్వీస్ ల ద్వారా కలగనున్న ఉపయోగాలను రాష్ట్ర ప్రభుత్వానికి సవివరంగా వివరించి వారిని ఒప్పించిన ఘనత మన ప్రియతమ నేత మైనంపల్లి హనుమంతరావుకి దక్కుతుంది.అనేక దఫాలుగా మైనంపల్లి హనుమంతరావు విన్నపాలను విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పారడైజ్ నుండి మేడ్చల్ జేబీఎస్ నుంచి షామీర్పేటకు మెట్రో సర్వీసులను అందించాలని నిర్ణయించింది.ఇందులో భాగంగానే నూతన సంవత్సర కానుకగా ఆయా సర్వీసులకు అవసరమైన డిపిఆర్ లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.దీంతో ఎన్నో ఏళ్లుగా మెట్రోసేవల కోసం ఎదురుచూస్తున్న అయ్యా ప్రాంతాల ప్రజలకల నెరవేరినట్లు అయింది.తమ కలను సాకారం చేసిన ప్రియతమ నేత మైనంపల్లి హనుమంతరావుకి వారంతా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.గత పదివేలుగా మెట్రో సేవల కోసం ఎంతో ఎదురు చూస్తున్నామని గత పాలకులు తమ విజ్ఞప్తులను వినతిని పట్టించుకోలేదని కానీ మా మైనంపల్లి హనుమంతన్న మెట్రో సేవలన్ సాధించడంలో విజయం సాధించారని వారు కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!