చేవెళ్ల
భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంత ఉత్సవాల సంబరాలు
పలుగుట్ట గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా
సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి
చేవెళ్ల మండలంలోని పలుగుట్ట గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శి పెంటయ్య అధ్యక్షతన నూతన సిపిఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై సిపిఐ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశంలో 100 వసంతాలు పూర్తి చేసుకున్న ఒకే ఒక్క పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది కమ్యూనిస్టులు అమరులు అయ్యారని జైలల్లో జీవిత కాలం గడిపారని ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారని ఆ రోజుల్లోనే కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి 44 రకాల చట్టాలను తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎర్రజెండాకే దక్కుతుందని తెలిపారు నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజాకళ్లను భూస్వాములను తరిమికొట్టిన గొప్ప చరిత్ర గల పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి సిపిఐ పార్టీ దోహదపడిందని తెలిపారు. గ్రామాలలో ప్రజా సంఘాల నిర్మాణం జరగాలని ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క ఘనతను చాటాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ,మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి, మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్ , శంకర్ పల్లి మండల కార్యదర్శి సుధీర్ , బి కేయూ జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య బాబురావు, మండల ఐఐటీయూసీ నాయకుడు యాదగిరి, మండల మహిళా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల , ఆశ వర్కర్లు మీనాక్షి ,కళావతి, పద్మ, రఘు, సత్తయ్య, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.