స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా: సోమవారం మెదక్ జిల్లా సంక్షేమ అధికారిగా నియమితులైన జె.హైమావతి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వారిని పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా తొర్రూరు సిడిపిఓగా దాదాపు 06 సంవత్సరాలుగా పనిచేసిన హైమావతిని పదోన్నతి కల్పించి మెదక్ జిల్లా సంక్షేమ అధికారిగా ప్రభుత్వం నియమించింది.బాధ్యతలు స్వీకరించిన.జిల్లా సంక్షేమ అధికారి హైమావతి మాట్లాడుతూ.. పదోన్నతి బాధ్యతను పెంచుతుందని. జిల్లా సంక్షేమ శాఖను అభివృద్ధి పథంలో నడిచే విధంగా ప్రణాళిక బద్దంగా సంబంధిత శాఖల.అధికారులు సమన్వయంతో పనిచేస్తామని ఆమె తెలిపారు. గతంలో జిల్లా సంక్షేమ అధికారిగా పనిచేసిన బ్రహ్మాజీ విధుల నుండి రిలీవై సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వెళ్లడం జరిగింది. పదోన్నతిపై మెదక్ జిల్లా సంక్షేమ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన హైమావతిని జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు.