స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా :- తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం పెండింగ్ ధరణి అర్జీలను స్పెషల్ డ్రైవ్ పద్ధతిలో పరిష్కరించడానికి జిల్లాలోని సమస్త రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై యున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం ధరణి పెండెన్సీ నివేదికలపై సంబంధిత జిల్లాలోని ఆర్డీవోలు తాసిల్దారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ పలు ఆదేశాలు జారీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి పెండెన్సీ పై సంబంధిత ఆర్డీవోలు తాసిల్దారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని ఇంకా మిగిలిన దరఖాస్తులను కూడా అతి త్వరలో పరిష్కరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం నాడు అన్ని తహశీల్దారు కార్యాలయాలలో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజలందరూ ధరణి సమస్యలు ఉంటె సంబందిత తహశీల్దారు లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో సోమవారం రోజున ప్రజావాణిలో సంబందిత కార్యాలయాలలో సంప్రదించుకునేలా ప్రజలకు అవకాశం కల్పించాలన్నారు
ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లాలోని ఆర్డీవోలు తాసిల్దారులు పాల్గొన్నారు.