షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నాటుకోళ్ల పంపిణీ
మహిళా శక్తి ప్రణాళికలో భాగంగా సంగెం గ్రామంలో కార్యక్రమం
ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తామని ప్రకటన
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించే విధంగా ప్రభుత్వం ద్వారా అనేక ప్రోత్సాహకాలు అందజేస్తుందని ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించేలా గ్రామాల్లో నాటుకోళ్ల పెంపకంతో ఆర్థిక ప్రగతి సాధించవచ్చని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(డిఆర్డిఎ) రూపొందించిన మహిళా శక్తి కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా కేశంపేట మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంగెం గ్రామంలో నాటు కోళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు, ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీవో, మాజీ జెడ్పిటిసి విశాల శ్రవణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరేశప్ప, శ్రీధర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇబ్రహీం, వెంకటేష్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో నాటు కోళ్ల పెంపకం చాలా సులువుగా ఉంటుందని అన్నారు. 50 కోళ్లు పెంచితే మూడు నెలల్లో దాదాపు 16వేల రూపాయల ఆదాయం గడించవచ్చని వివరించారు. గ్రామాల్లో నాటు కోళ్లు గేదెల పెంపకం ఎంతో లాభసాటిగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారని అన్నారు.
గ్రామాల్లో కూలినాళీ చేసుకుని మహిళలు మరోవైపు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల్లో భాగంగా నాటు కోళ్ల పెంపకం ఎంతో లాభం సాటిగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదుగుతేనే ఆ కుటుంబాలు, సంసారాలు బాగుపడతాయని అన్నారు.
రాజకీయాలు వద్దు..
గ్రామాల్లో ప్రజలు ఐకమత్యంగా ఉండాలని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వివరించాలని ఎమ్మెల్యే హితబోధ చేశారు. గత ప్రభుత్వంలో పాఠశాలల చైర్మన్ ల ఎంపిక విషయంలో అడ్డగోలుగా వ్యవహరించారని చురకలు అంటించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చైర్మన్ ల ఎంపిక ఉంటుందని అన్నారు. అదేవిధంగా ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యం రాబోతున్నాయని గుర్తు చేశారు. ప్రజలు ఓటు వేశాక వారి ఆశలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు.
నేను మాంసం తినను.. సభలో నవ్వులు పూజించిన వీర్లపల్లి శంకర్
నాటు కోళ్ల పెంపకం వాటి వల్ల జరిగే లాభాసటి విషయాలను వెల్లడిస్తున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సభలో నవ్వులు పూజించారు. నాటు కోళ్ల మాంసం గురించి మాట్లాడుతుండగా తనకు మాంసం తినే అలవాటు లేదని చెప్పడంతో సభికులు అందరూ నవ్వారు. ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ శాకాహారి అన్న విషయం అందరికీ తెలిసిందే..