సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా: శనివారం రోజున స్థానిక అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజన క్రీడోత్సవాల్లో అదనపు కలెక్టర్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంల జిల్లా స్థాయి యువజనోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు (08) జిల్లాలో గల యువత పెద్ద ఎత్తున పాల్గొని క్రీడలలో పాల్గొన్నారు. అని చెప్పారు.వివిధ సాంస్కృతిక పోటీలను ప్రదర్శించడం జరిగిందని వివరించారు.వివిద వేషదారణంలో పాల్గొని డ్యాన్సులు, పాటలలో అలరించాయని చెప్పారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని క్రీడలు మానసిక శారీరక వ్యక్తిగత ఆరోగ్యానికి దోహదం చేస్తాయని ప్రతి వ్యక్తి దైనందిక జీవితంలో క్రీడలను అలవర్చుకుని తన ఆరోగ్య రక్షణ పై చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గని గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.