వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
మొగిలిగిద్దలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. వారితో పాటు అశోక్ గౌడ్ బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి, జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరు వెంకటేష్ గుప్తా, అగ్గి ప్రవీణ్, సురేష్, పొగుల నర్సింహ, శక్తి కేంద్ర సహా ఇంచార్జీ పాలెపల్లి గిరి, బూతు అధ్యక్షులు 170 మధగారి మహేష్ ,బూతు అధ్యక్షులు 171మల్లెల అనందు కుమార్, బూతు అధ్యక్షులు 172 పిల్లి బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఓట్ల రాజకీయం చేస్తూ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు షాద్ నగర్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. తరువాత ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మిదేవి పల్లి రిజర్వాయర్ ను కచ్చితంగా నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి,చివరికి షాద్ నగర్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దారి మళ్ళిస్తుందని, రైతులను,మహిళలను,నిరుద్యోగ యువతను, విద్యార్థులను, వివిధ వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. ఈ సారి తెలంగాణా రాష్ట్రంలో అత్యధికంగా సభ్యులు కావాలని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని అన్నారు.
జనసంఘ్ నుండి క్రమం తప్పకుండ ఈ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహిస్తుందని, ముఖ్యం గా యువత ను మహిళలను పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో నిర్వహిస్తుందని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా విస్తరించిందని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించబోతుందని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మొగిలి నర్సింలు, సారా అంజయ్య, పల్లెగట్టు శ్రీను,కోట్ల రవి గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు..