రోమియో రమేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి
షాద్ నగర్ భాగతసింగ్ కాలనిలో రోమియో రమేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భగత్ సింగ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిశోరం, భరతమాత స్వేచ్ఛ కోసం ఉరికంబాన్ని ఆనందంగా ముద్దాడిన వీరతేజం అని కొనియాడారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ భారతీయుల గుండెల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చిన సింహనినాదం అని చెప్పారు. అలాగే “నన్ను చంపగలరు కానీ నా ఆలోచనలను చంపలేరు” అంటూ ఆంగ్లేయుల గుండెల్లో భయాన్ని పుట్టించిన విప్లవ కెరటం అంటూ.. కొనియాడారు. కార్యక్రమంలోరోమియో రమేష్, బాస రాజు, నదికూడా నర్సింలు, నడికూడ రాజు, ఎం.శ్రీను, చెన్న బాలరాజు, రాజేశ్వర్ రెడ్డి, మేడిపల్లి సుధాకర్, కృష్ణమాచారి మరియు తదితరులు పాల్గొన్నారు.