దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటి పరిధిలోని సోలిపూర్ చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన భక్త బృందం సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని పల్లకిలో మోస్తూ శ్రీరామ జయరామ, జయ జయ రామ నినాదాలతో ఆట పాటలతో, భజనలతో భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. భక్తి పాటలు భజనలతో ఆలయంలో శ్రీరామ నామ స్మరణ మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు, రాఘవేంద్ర చార్య, అర్చకులు కృష్ణ, ప్రమోద్, సునీల్ పంతులు భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దేవాలయ అభివృద్ధికి, అన్నదాన కార్యక్రమానికి దాతలు సహకరించాలని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో పులిమామిడి శ్రీశైలం గౌడ్, ఎంసాని నర్సింలు, వసంతరావు, అన్నారం రఘు గౌడ్, గడ్డమీద రమేష్ ముదిరాజ్, రఘునందన్ రెడ్డి, క్యూసెట్ శ్రీనివాస్, కిషన్ నాయక్, రాఘవేందర్, నారాయణ, వీర్లపల్లి కృష్ణయ్య, లక్ష్మికాంత్ రెడ్డి, కృష్ణ చారి, శంకరయ్య యాదవ్, వీఆర్వో బచ్చన్న, యాదగిరి, పి.ప్రవీణ్ గౌడ్, పద్మా వెంకటేష్, గోరియా నాయక్, కొత్త సత్తయ్య గౌడ్, శ్రీనివాస్, రమేష్, సుధాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్, మాజీ వార్డు సభ్యులు సింగపాగ లక్ష్మయ్య, భజన భక్త బృందం, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గోశాలకు పశు దాణా(కుట్టి) వితరణ
సోలిపూర్ వెంకటేశ్వరరావు పంతులు 10 వేలు ఆర్థిక సహాయం
నవదుర్గ కంపెనీ మేనేజర్ బొలా రాం 10 వేలు ఆర్థిక సహాయం
దేవాలయ ఆవరణలోని శ్రీకృష్ణ గోశాలకు శనివారం దాతలు పశు దాణా(కుట్టి) వితరణ చేశారు. సోలిపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు పంతులు పది వేల రూపాయలు పశు దాణా కోసం ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా మోతీ ఘనపూర్ లోని నవదుర్గ కంపెనీ మేనేజర్ బొలా రాం పది వేలు ఆర్థిక సహాయం చేశారు. వారి ఆర్థిక సహాయంతో శనివారం గోవులకు ఒక లోడు పశు దాణా (కుట్టి)ని అందజేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు శ్రీశైలం గౌడ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు..