రైతు సంఘం డిమాండ్.
స్టూడియో 10TV
ADONI DIVISION
కౌతాళం మండలం చాలా వెనుకబడిన ప్రాంతము. ప్రతి సంవత్సరం అతివృష్టి, అనావృష్టి వల్ల రైతులు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు తీర్చడానికి ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం వలసలు పోతున్నారు. అందుకు తుంగభద్ర నదిపై వరద కాలువ ,లేదా రైట్ కెనాల్ నిర్మించాలని తెలుగుదేశం పార్టీ మండల ముఖ్య నాయకులు చూడి ఉ లిగయ్య గారిని కలసి రైతు సంఘం గా మేమోరాండం ఇవ్వడం అయినది.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య మాట్లాడుతూ కౌతాళం మండలం లో LLC కెనాల్ ,తుంగభద్ర నది ప్రవహిస్తున్న రైతులకు ఉపయోగపరంగా లేదు. ప్రతి సంవత్సరం ఈ మండలంలో పత్తి ,మిరప వేసిన రైతులు తెగులు వలన, వర్షాలు సరిగా లేక పెట్టిన పెట్టుబడులు కూడా రాక 10 ఎకరాలు ఉన్న రైతులు సైతం బెంగళూరు, బొంబాయి, గుంటూరు, తెలంగాణ ఇతర ప్రాంతాలకు బతుకు తెరువు కోసం పిల్ల ,పాపలను కట్టుకొని వలసలు పోతున్నారు .ఈ వలసల నివారణ కొరకు తుంగభద్ర నదిపై వరద కాలువ నిర్మిస్తే మండలం శశ్యామలం అవుతుందని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సుబ్బారాయుడు సార్ గారు చెప్పినారు. గతంలో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినారు.
మేమిచ్చిన మెమోరాండం చూసి సంతోషించి ఉల్లిగయ్య గారు వెంటనే స్పందించి తుంగభద్ర నది పై వరద కాలువ, లేదా చీకలపర్వి దగ్గర తుంగభద్ర నదిపై బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తున్నారు. అక్కడ రైట్ కెనాల్ నిర్మించడానికి నేను ప్రభుత్వముతో మాట్లాడి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇవ్వడం అయినది.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఈరన్న రైతు సంఘం నాయకులు ఉలిగయ్య, తాయప్ప, వీరయ్య స్వామి, ఈరన్న ,రంజాన్ సాబ్ ,వీరేష్ ,బసవరాజు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.