మంత్రాలయం న్యూస్ :-ఆదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామంలో అతి పురాతనమైన శ్రీ రామ దేవాలయం గుడిలో 9/9/2024 రోజున హుండీ దొంగతనం జరిగింది. హుండీ దొంగతనం జరిగే ఆరు రోజులైనా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాలేదు.
శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం దత్తత అయిన శ్రీ రామ దేవాలయం కార్యనిర్వహణ అధికారిగ పూర్తి బాధ్యత వారిదే దొంగతనం జరిగి ఆరు రోజులైనా ఇప్పటివరకు శ్రీ రామ దేవాలయం గుడి లో హుండీ చోరికి పాల్పడిన ప్రదేశాన్ని పరిశీలించలేదు.
మీడియా సమావేశంలో శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం కార్య నిర్వహణ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామం లో హుండీ దొంగతనం జరిగిన మాట వాస్తవమే అనీ హుండీ లాక్ తీసి డబ్బులు తీసుకున్నారు. సీసీ కెమెరాలు సరిగ్గా రికార్డు కాలేదు,త్వరలోనే గర్భాలయంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తానని సిసి కెమెరాలు మేనేజ్మెంట్ బాధ్యతగా రామాంజనేయులు చూసుకుంటున్నాడని దేవస్థానం కార్య నిర్వహణ అధికార వెంకటేశ్వర్లు అన్నారు. ప్రభుత్వం జీతం తీసుకుంటూ ప్రభుత్వ సంపాదన కాపాడవలసిన ప్రభుత్వ అధికారి ఒక బయట వ్యక్తికి సిసి కెమెరాలు బాధ్యతగా చూసుకుంటాడుఅన్నమాట దేవస్థానం కార్య నిర్వహణ అధికారికి సిగ్గుచేటుని ఇక శ్రీ రామా దేవాలయం హుండీని ఆ భగవంతుడు సాక్షాత్ శ్రీ కోదండ రాముడే కాపాడుకోవాలని భక్తులుకోరుకుంటున్నారు.