గణేష్ నిమజ్జానికి ప్రశాంత నిర్వహిణకు పగడ్బందీగా చర్యలు .జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.

తేది 16-09-2024

జిల్లా వ్యాప్తంగా 2,975 ,మెదక్ పట్టణంలో 168 గణేష్ విగ్రహాలు నిమజ్జనం కలెక్టర్
నిమజ్జన విధులలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి.*
మెదక్ పట్టణంలో నిమజ్జనానికి 03 క్రేన్లు,(01) జె.సి.బి, 10 మంది గజ ఈతగాళ్లు, ఏర్పాటు చేశాం
పరిసరాల పరిశుభ్రత పై శానిటేషన్ వర్కర్ల నియామకం మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, మున్సిపల్ చైర్మన్. చంద్రపాల్ మునిసిపల్ E.E మహేష్ సంబంధిత అధికారులతో కలిసి మెదక్ కొంటూరు చెరువు దగ్గర గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన*

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*

గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణం లో నిర్వహించేందుకు పగడ్బందీగా చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.

సోమవారం మెదక్ పట్టణంలోని కొంటూరు చెరువు గణేష్ నిమజ్జన ప్రాంతాల ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్ర స్థాయిలోసంబంధిత
శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
గణేష్ విగ్రహాల నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు.గణనాధుని నవరాత్రులు పూజించిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజనం చేయుటకు సోమవారం మధ్యాహ్నం నుండి నిమజ్జనం చేసే క్రమంలో భక్తిశ్రద్ధలతో సాగనంపుటకు భక్తులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు
మెదక్ పట్టణం కొంటూరు చెరువు వద్ద బారికేడ్లు,(03) క్రేయిన్లను,01 జెసిబి ,10 మంది గజ ఈతగాలను లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెరువులు కాలువల్లో భారీగా నీరు ఉన్నందున ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్ళు ఫైర్‌సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
నిమజ్జన సమయంలో ఇతరులను ఆప్రదేశానికి రాకుండా కట్టుదిట్టంగా బ్యారికేడ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
గణేష్ విగ్రహ నిమజ్జనానికి వివిధ శాఖల అధికారులకు విధులు కేటాయించామని వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నిమజ్జనానికి పోలీసు బందోబస్తుతో సహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా ఉత్సవా కమిటీ సభ్యులు గణేష్ మండల్ నిర్వాహకులు ప్రజలు సహకరించి కలెక్టర్ కోరారు.
శోభాయాత్రలో జాగ్రత్తలు నిమజ్జన సమయంలో భక్తులు పాటించాల్సిన జాగ్రత్తల గురించి కలెక్టర్ సుదీర్ఘంగా వివరించారు.ఉత్సవ సమితి బాధ్యులు భక్తులు పోలీసుల సూచనలు పాటించాలి.శోభాయాత్రలో పూర్తిగా సంయమనం పాటించాలి.
యువకులు ఎలాంటి ఉద్వేగాలకు గురవకుండా క్రమపద్ధతి పాటించాలి.
విగ్రహాలను మండపం నుంచి వాహనంపైకి చేర్చే సమయాన విద్యుత్ తీగల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.
సెట్టింగుల సమీపంలో బాణాసంచాలు పేల్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నిమజ్జన సమయంలో
నిమజ్జన సమయంలో అధికార యంత్రాంగం ఏర్పాటు చేసే క్రేన్లు తదితర వాటి సమీపంలోకి వెళ్లకూడదు.
పోలీసులు నిమజ్జనం చేసే సదరు నిర్వాహకుల హెచ్చరికలు కాదని భక్తులు నీటిలోకి దిగేందుకు ప్రయత్నం చేయొద్దు.ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లలోకి దిగకూడదు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో సామరస్య పూర్వక వాతావరణం ఉండేలా చూడాలి.నిర్వాహకులు శాంతి సామరస్యపూర్వకంగా
ఉండాలి.ప్రధానంగా ఊరేగింపు సమయంలో ఆధ్యాత్మిక చింతనప్రజ్వరిల్లేలా మన సంస్కృతి సంప్రదాయాల భక్తి పాటలు నృత్యాలు కోలాటాలు పెట్టుకోవాలి.
విగ్రహాలను తరలించే వాహనాల కండీషన్ సరిగా ఉండేలా చూడాలి.విగ్రహాలను ఘాట్ల వద్దకు కాకుండా వేరేచోట్లకు తీసుకెళ్లొద్దు. గుంపులుగా పిల్లలతో రావొద్దు.
ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా పోలీసు సిబ్బందికి
సహకరించాలి.
అపశ్రుతులకు తావులేకుండా వినాయక నిమజ్జనంసాఫిగా
ముగియాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట మెదక్ ఆర్.డి.ఓ రమాదేవి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ D.E మహేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!