విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసేలాప్రవర్తిస్తే ప్రైవేట్ పాఠశాల యజమానియాలపై కఠిన చర్యలు తీసుకొనబడుతాయి.మెదక్ డి.ఈ.ఓ.రథకిషన్

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.

ఈరోజు డీఈవో ఆదేశాల ప్రకారంగా మెదక్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాలను సందర్శించి విద్యార్థుల చేతి కంకణాలు తొలగించిన యజమాన్యం అనే అంశంపై కరస్పాండెంట్ మరియు ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా విద్యార్థులలో క్రమశిక్షణ తో పాటుగా ప్రతిరోజు పాఠశాలకు వచ్చే డ్రెస్ కోడు మెయిన్టైన్ చేసే క్రమంలో పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీలు కొంతమంది విద్యార్థులు యొక్క చేతికి ఉన్నటువంటి Colour Bands ను తొలగించే క్రమంలో దాంతోపాటు అనుకోకుండా కొంతమంది విద్యార్థులు యొక్క వినాయక చవితి దారాలుకూడా బై మిస్టేక్ గా కట్ అయినట్టుమా దృష్టికి వచ్చినట్టు యాజమాన్యం తెలియజేసినారు వాస్తవానికి ఇది మా దృష్టికి వచ్చిన వెంటనే pet లను మందలించనైనది ఇది కావలసి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదని అనుకోకుండా జరిగిన సంఘటన అని దానికి యజమాన్యం మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా జరగకుండా చూసుకుంటామని తెలిపినారు.అదేవిధంగా 8 ,9 మరియు10వ తరగతి కొంతమంది విద్యార్థిని విద్యార్థులను పిలిచి విచారించగా విద్యార్థిని విద్యార్థులు కూడా రాఖీ పండుగ సంబంధించినటువంటి కొన్ని colour bands కొన్ని పూసల తో ఉన్నటువంటి వాటిని pet తొలగించినట్లు ఒక విద్యార్థిని తెలిపారు కానీ వినాయక చవితి సంబంధించిన కంకణాల పైన మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరని విద్యార్థిని విద్యార్థులు తెలిపినారు.
ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ఆదేశించింది ఏమనగా ఇకముందు పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి మానసిక ఇబ్బందులకు గురిచేసిన మతపరమైన అంశాలను లేవనెత్తిన విద్యార్తుల మనోభావాలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు నిర్వహించిన మీపైన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకొని బడతాయని మండల విద్యాధికారి ఆదేశించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!