బండోని గూడ ఆర్వో ప్లాంట్ వద్ద ఎమ్మెల్సీని అరెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చిన పోలీసులు
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు శుక్రవారం ముందస్తు అరెస్ట్ చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో ఎమ్మెల్యే అరికపూడి గాంధీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని శాంతి భద్రతల చర్యల నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం బండోని గూడ వద్ద ఒక వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ఉన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని పోలీసులు ఉన్నఫలంగా అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో పాటు ఆయన అనుచరులను చాలామందిని అదుపులోకి తీసుకొని మొదల్లగుడలోని ఆయన ఇంటికి తరలించారు. పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటినీ ముట్టడిస్తామని బీఆర్ఎస్ సవాల్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికి అక్కడ బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో మాజీ ఎంపిటిసి కాట్న మాధవి రవీందర్ కాట్నా లతా శ్రీశైలం పిఎసిఎస్ చైర్మన్ అశోక్ నరసప్పగూడ మాజీ సర్పంచ్ అశోక్ సింగల్ విండో డైరెక్టర్ నరసింహ నరసప్పగూడ ఉప సర్పంచ్ జంగిల్ కుమార్ శేఖర్ తదితరులు ఉన్నారు.. కేపీ