సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిథి మెదక్ జిల్లా.
ఉత్తమ విద్యాబాధనకు ప్రభుత్వ పాఠశాలలు తార్కాణాలు
తరగతి గదిలో విద్యార్థినుల పాఠాలు బోధించి సామర్ధ్యాలు పరీక్షిస్తూ సంతృప్తి చెందిన కలెక్టర్
సీజనల్ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అశ్రద్ధ చేయరాదని అప్రమత్తంగా ఉండాలి… కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ నిరంతరం పరిశుభ్రంగా ఉండాలి.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయం, ఆయుష్మాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
పాపన్నపేట కస్తూరిబా గాంధీ విద్యాలయం అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, ఆరోగ్య కేంద్రంలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కస్తూరిబా విద్యార్థినిలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాపన్నపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను, స్టాక్ రూమ్ ను వంటలను కలెక్టర్ పరిశీలించారు. స్వయంగా కలెక్టర్ పాఠాలు బోధించి విద్యార్థినుల సామర్థ్యాలను విద్యా బోధన పరిశీలించారు సంతృప్తి వ్యక్తం చేశారు . విద్యాలయ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయ మరింత బలోపేతం చేస్తుందని విద్యార్థినులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. విద్యార్థులకు వడ్డించే ఆహారం కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని మంచినీటి ప్లాంట్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ రక్షిత మంచినీరు అందించాలన్నారు. సకాలంలో సిలబస్‌ను పూర్తిచేసి ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
టాయిలెట్స్ ను పరిశీలించి వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నాణ్యమైన మెనూ అందించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జ్వరమే కదా అని అశ్రద్ధ తగదు అన్నారు. రక్త నమూనాలను అందజేసి పరీక్షలు తెప్పించుకోవాలని అందుకు తగినట్లుగా వైద్యం పొందాలన్నారు.డాక్టర్లు ప్రతి పేషంట్ కు కె షీట్ ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. సిబ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్యం అందించాలని ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. వార్డు ను సందర్శించి పేషంట్ లతో మాట్లాడారు.అధికారులు గ్రామాలలో పర్యటిస్తున్నారని పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.