కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ వట్టి మోసమని, గత ప్రభుత్వం కన్నా, అధికంగా ధరలు ఉన్నాయని సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, రైల్వే కోడూర్ సిఐటియు మండల కార్యదర్శి పి.జాన్ ప్రసాద్, కోడూరు సిఐటియు ఆఫీసులో బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేదని, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవన్నారు. అదేవిధంగా సిమెంటు , ఇనుప కమ్మి, ఇటుకలు, వ్యాపారం లేదన్నారు. టిడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ, వట్టి బూటకం అన్నారు. ట్రాక్టరు, గతంలో 3000 ఇసుకొచ్చేదని, నేడు 8000, 10000 పెట్టిన దొరకడం లేదన్నారు. టిప్పర్, 15000, పైగానే వసూలు చేస్తున్నారు. సీనరీస్, జీఎస్టీ, ట్రాన్స్పోర్ట్, పేరుతో వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారన్నారు. గతం కన్నా, అధికంగా ఇసుక ధరలు ఉన్నాయని తెలిపారు. నేతి బీరకాయలు నెయ్యి సామెత లాగా ఉచిత ఇసుక పాలసీ అమలు కావడం లేదని తెలిపారు. రాజంపేట, రైల్వే కోడూరు కి, రెండు నియోజకవర్గాలకు, రాజంపేట బాలరాజు పల్లి, బుడుగుంట పల్లి వద్ద స్టాక్ పాయింట్ పెట్టారని, అందరికీ టోకెన్లు అందక, ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కావున ఇసుక కోరీలు, బాలరాజు పల్లి, నందలూరు, గుండ్లూరు, టంగుటూరు, మందరం, నారాయణనెల్లూరు, బెస్తపల్లి, పెనగలూరు, తదితర ప్రాంతాల్లో, క్వారీలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎద్దుల బండ్లకు, ట్రాక్టర్లకు, ఉపాధి కూలీలతో, ఇసుక పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పకృతిలో ప్రతి ఏడాది వరదలకు ఇసుక మేటలు ఏర్పడతాయని, ఎవరు ఉత్పత్తి చేసి ఇసుక పంటలు పండించారని తెలిపారు. గత ప్రభుత్వంలో సిఐటియు ఇసుక దీక్షలు చేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో నిల్వ ఉంచిన ఇసుక డంపింగ్లను, అధికార పార్టీ అధికారంలోకి వస్తానే, కబ్జాదారులు మాయం చేశారని ఆరోపించారు. వాటి పైన విచారం జరపాలన్నారు. అక్రమంగా, జెసిపిలతో, లారీలతో అక్రమ రవాణా జరక్కుండా అడ్డుకోవాలని ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. సీనరీ చార్జీలు, జీఎస్టీలు, సంబంధం లేకుండా,ఉచిత ఇసుకను అందించాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.