సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
- గత పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొబ్బరికాయలకే పరిమితం అయ్యింది
- ఎనిమిది నెలల్లో నియోజక వర్గానికి మెడికల్ కళాశాల
- ఢిల్లీలోని కేంద్ర మెడికల్ బోర్డ్ తో చర్చించి అనుమతి తెచ్చాము
- 2024-2025 విద్యాసంవత్సరానికి తరగతులు ప్రారంభం అయ్యేల చర్యలు చేపడ్తాం.
మెదక్ నియోజక వర్గంకు మంజూరు అయిన మెడికల్ కళాశాల అనుమతిపై పలు పార్టీల నాయకులు చేసిన ఆరోపణలు బెడిసే కొట్టేలా మెదక్ నియోజక వర్గంకు మంజూరు అయిన మెడికల్ కళాశాలకు అనుమతి లభించిందని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యేడా.మైనంపల్లి రోహిత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ కు మంజూరు అయిన మెడికల్ కళాశాల అనుమతి విషయమై ప్రత్యేకంగా చొరవ చూపడమే కాకుండా ఢిల్లీలోని కేంద్ర మెడికల్ బోర్డుతో చర్చించి అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేశామని పేర్కోన్నారు.అదే విధంగా 2024-2025 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపడ్తామని పేర్కోన్నారు. అదే విధంగా గత పదేండ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ నియోజక వర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని ఆయన ఎద్దేవ చేశారు.గత ప్రభుత్వం పదేండ్లుగా మెదక్ కు దగా చేసింది తప్పా ఒరగబెట్టింది ఏమిలేదని ఆయన అన్నారు.మెడికల్ కళాశాల విషయంలో గత పదేండ్లుగా మంత్రులు ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టడం తప్ప చేసింది ఏమిలేదని ఆయన గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలే అయినా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించామని ఆయన అన్నారు.అదే విధంగా మెదక్ నియోజక వర్గంకు మంజూరు అయిన మెడికల్ కళాశాలకు అనుమతి లభించడం మెదక్ నియోజక వర్గ ప్రజలకు శుభపరిణామం అని ఆయన తెలిపారు.మెడికల్ కళాశాల వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.