సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల జోనల్ అధికారిణి నిర్మల
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలల్లో ఐదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగిలిపోయిన సీట్ల భర్తీకి సంబంధించి ఈనెల 12న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జోనల్ అధికారిణి నిర్మల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2024–20 25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుండి 9వ తరగతిలో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 12వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న అతికొద్దీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు.దీనికి సంబంధించి కేవలం అర్హత కలిగిన ఎస్సీ విద్యార్థిని విద్యార్థులు ఈనెల 12వ తేదీన ఇస్నాపూర్ పాఠశాలలో నిర్వహించే కౌన్సిలింగ్కు హాజరు కావాలని దీనిలో 2024–20-25 లో వీజీ సెట్ బీఎల్వీ సెట్ పరీక్షలు రాసిన వారికి ప్రథమ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని నిర్మల తెలిపారు. ఈ మేరకు అప్లికేషన్లు 12వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని స్పాట్ అడ్మిషన్లు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు ఉదయం 9 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి హాజరుకావాలని అధికారిణి నిర్మల స్పష్టం చేశారు.