సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి మెదక్ జిల్లా.
మెదక్: తెలంగాణ భాష యాసను ఎలుగెత్తి చాటిన గొంతుక మహాకవి కాలోజీ అని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. సోమవారం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా స్థానిక టీఎన్జీవో భవన్లో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు.తెలంగాణ భాష యాసను నాడు అవహేళన చేసిన వారే నేడు భాషా భావాన్ని దేశవ్యాప్తంగా విస్తరణ చేస్తున్నారన్నారు అందుకు కవులు కళాకారులే కారణమని వారిని అభినందించారు.తెలంగాణ వాడుక భాష యాసను మనుగడలోకి తెచ్చి ఆచరించి గౌరవించే విధంగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన తెలంగాణ భాషా పిత కాలోజీ అని వారిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై కాళోజి జయంతి సందర్భంగా వారి సేవలను గుర్తుచేసుకొని తెలంగాణ భాష యాస పట్ల తనకున్న మమకారాన్ని కవిత్వాల రూపంలో ప్రజలకు వివరించారని వారి స్ఫూర్తితో మన భాషను గౌరవించుకొని కాపాడుకోవాలని తెలియజేశారు.తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు విద్యార్థిని నాగేశ్వరి చేసిన సాంప్రదాయ నృత్యం అందరినీ ఆకట్టుకుంది. టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గాండ్ల అనురాధ ఉపాధ్యక్షులు యండి ఫజలుద్దీన్ అధ్యాపకులు సుధాకర్ ఇక్బాల్ కానుగు రాధిక సరళ అంజయ్య తదితర కవులు కళాకారులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.