సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
మంగళవారం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ సహకారంతో మహిళా అభివృద్ధి సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నీరు పారిశుద్ధ్యం పరిశుభ్రతపై డి.ఆర్.డి.ఓ మెప్మా మహిళా సంఘాలకు ఏ.పి.ఎం, డి.పి.ఎం లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీరు పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత వ్యక్తిగత శారీరక పరిసరాల పరిశుభ్రత పై ప్రజలను చైతన్యం చేయడంలో డిఆర్డిఏ మెప్మా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం పచ్చదనం ఆరోగ్యం సమపాళ్లలో అందినప్పుడే ఆరోగ్యం అంతమైన సమాజం ఏర్పడుతుందని పౌరులు త్రాగడానికి స్వచ్ఛమైన నీరు ఉండేలా మరియు వారి పరిశుభ్రత కు చైతన్యవంతులు కావాలని ఇది వారి జీవితకాలాన్ని బాగు చేస్తుందని వివరించారు. పారిశుధ్యం అనేది కొన్ని రకాల కాలుష్యం మరియు అనారోగ్య వాతావరణాల వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి తనను తాను మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడాన్ని సూచిస్తుందని తెలిపారు.
అంతకుముందు సురక్షితమైన తాగునీరు మరియు పారిశుద్ధ్యనికి ప్రధాన అవరోధాలు ఆర్థిక వనరులు ఈ అవరోధాలను ఎదుర్కోవడానికి పరిష్కరించడానికి నీరు పారిశుధ్య రుణాలను అందజేయడం ఇంటి యొక్క నీటి వసతులు మరియు మరుగుదొడ్డి సమస్యలు పరిష్కారం కోసం ఆర్థిక వనరులు సమకూర్చడానికి మరియు నిపుణుల సేవలు అందించడానికి చిన్న సరళమైన రుణాలు సులభంగా తిరిగి చెల్లించేలా చేయడం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మహిళా అభివృద్ధి సొసైటీ హైదరాబాద్ బ్రహ్మచారి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, మెప్మా పీడీ ఇందిర డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్.ఓ నవీన్ ఏపీ.డి సరస్వతి భూగర్భ జల శాఖ అధికారి ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.